మల్టీ జోనర్ చిత్రాలతో వెంకీ మామ లైనప్..!

మల్టీ జోనర్ చిత్రాలతో వెంకీ మామ లైనప్..!

Published on Jun 27, 2026 2:05 PM IST

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ త్వరలోనే వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పేరొందిన ఆయన, ఈసారి నలుగురు టాప్ దర్శకులతో నాలుగు వేర్వేరు జోనర్లలో సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద మరోసారి విక్టరీ జెండా ఎగరేసేందుకు లైనప్ సెట్ చేసుకున్నాడు.

ఈ క్రేజీ లైనప్‌లో తొలుత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమాను రూపొందిస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ మ్యాజిక్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ చిత్రం ఉండనుంది. దీంతో పాటు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ మల్టీస్టారర్ చిత్రాన్ని ఇటీవల ప్రారంభించారు. ఇక ఈ సినిమాల తర్వాత ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ డ్రామాను వెంకీ చేయనున్నాడట.

అటు మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించడానికి దర్శకుడు బాబీతో వెంకీ త్వరలో ఓ పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేస్తున్నాడట. ఇలా క్లాస్, మాస్, కామెడీ మరియు యాక్షన్ జోనర్లతో వెంకటేష్ చేస్తున్న ఈ సరికొత్త ప్రయోగం టాలీవుడ్‌లో సరికొత్త సంచలనంగా మారనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు