తెలుగమ్మాయిల్ని వెతుకుతున్న ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు

Published on Jun 20, 2019 6:04 pm IST

గతేడాది విడుదలైన చిత్రాల్లో ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అన్ని అంశాల్లో వాస్తవికతకు దగ్గరగా ఉండే ఈ సినిమాను ప్రేక్షకులు, విమర్శకులు, సినీ పెద్దలు ప్రశంసించారు. ఆ చిత్ర దర్శకుడు వెంకటేష్ మహా పై పొగడ్తల వర్షం కురిసింది. ఆయనకు ఆఫర్లు కూడా పెరిగాయి. కానీ మహా మాత్రం తన శైలిలోనే సినిమాలు చేయాలనుకుంటున్నారు.

అందుకే కొంచెం గ్యాప్ తీసుకుని రెండవ చిత్రాన్ని స్టార్ట్ చేశారు. ప్రస్తుతం కథలో ముగ్గురు కథానాయికల పాత్రలు చేయడానికి తెలుగు స్పష్టంగా మాట్లాడగల అచ్చమైన తెలుగమ్మాయిల కోసం వెతుకుతున్నారు. వారు దొరకగానే షూటింగ్ మొదలుకావొచ్చు. ఈ చిత్రాన్ని కూడా ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్ర నిర్మాత విజయ ప్రవీణ పరుచూరి నిర్మిస్తున్నారు. మరి మొదటి సినిమాతో తనలోని మ్యాజిక్ చూపిం వెంకటేష్ మహా రెండవ సినిమాతో ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More