మూకీ సినిమా చేయనున్న విక్టరీ వెంకటేష్.!

మూకీ సినిమా చేయనున్న విక్టరీ వెంకటేష్.!

Published on Jul 14, 2014 6:17 PM IST

venkatesh
విక్టరీ వెంకటేష్ తన వయసుకు తగ్గట్టుగానే సినిమాలు చేస్తూ సరికొత్త ట్రెండ్ ని సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఆయన మహేష్ బాబు తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేసి మల్టీ స్టారర్ సినిమాకి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ‘మసాలా’ సినిమా చేసారు. ఇటీవలే ఆయన నటించిన ఫ్యామిలీ థ్రిల్లర్ దృశ్యం సినిమా హిట్ అవ్వడమే కాకుండా కొత్త సినిమాలకు నాంది పలికిందని చెప్పాలి. ఇవన్నీ కాకుండా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి ‘గోపాల గోపాల’ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు.

మాకు అందిన తాజా సమాచారం ప్రకారం మల్టీ స్టారర్, థ్రిల్లర్ సినిమాల తర్వాత మరో డిఫరెంట్ సినిమా చేయడానికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే మూకీ మూవీ. ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం సైగలతో, హావ భావాలతో మాత్రం ఆకట్టుకునే సినిమా. ఈ సినిమాకి ‘పిల్ల జమిందార్’ ఫేం అశోక్ దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే వెంకటేష్ అశోక్ చెప్పిన స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కానీ ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళతారు, మిగతా నటీనటులు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

గతంలో ఇలాంటి మూకీ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ‘పుష్పక విమానం’. సింగీతం శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమల్ హాసన్, అమల జంటగా నటించారు. ఈ సినిమాలానే వెంకటేష్ నటించే సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.

తాజా వార్తలు