జెట్ స్పీడ్ తో వెంకీ మామ “దృశ్యం 2”.!

Published on Apr 6, 2021 12:00 pm IST

మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ హీరోలలో ఒకరైన స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇప్పుడు తన ఆల్ టైం సూపర్ హిట్ రీమేక్ “దృశ్యం” సీక్వెల్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే దీని కంటే ముందు మరో హిట్ సీక్వెల్ “ఎఫ్ 3” కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే దీని కన్నా లేట్ గానే స్టార్ట్ చేసినా “దృశ్యం 2” మాత్రం జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నట్టు తెలుస్తుంది.

తెలుగులో కూడా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై లేటెస్ట్ టాక్ వినిపిస్తుంది. మేకర్స్ ఆల్రెడీ ఈ సినిమాకు రిలీజ్ డేట్ ను లాక్ చేసేసారట. మరి దాని ప్రకారం ఈ చిత్రాన్ని వచ్చే జూన్ 20 విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ రోజు రిలీజ్ కోసం మేకర్స్ సహా క్యాస్టింగ్ కూడా శరవేగంగా సినిమాలో పాల్గొంటున్నారట. అయితే ఆరోజునే విడుదల ఎందుకంటే ఫాథర్స్ డే కనుక ఈ చిత్రాన్ని అప్పటికి విడుదల చేసే యోచనలో ఉన్నారట. మరి ఈ చిత్రం అప్పటికే వస్తుందా లేదా అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం :