సెన్సార్ కంప్లీట్ చేసుకున్న వెంకీమామ “నారప్ప”.!

Published on Jun 29, 2021 3:46 pm IST

అందరి అభిమాన హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రాల్లో “నారప్ప” కూడా ఒకటి. కోలీవుడ్ సూపర్ హిట్ చిత్రం అసురన్ కి రీమేక్ గా ఈ చిత్రాన్ని క్లాస్ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం మన తెలుగులో ఎప్పుడో షూట్ కంప్లీట్ అయ్యిపోయి రిలీజ్ కి కూడా రెడీ అయ్యిన సంగతి కూడా తెలిసిందే.

కానీ ఇప్పుడు పరిస్థితులు రీత్యా ఓటిటి వైపు ఈ చిత్రం అడుగులు వేస్తుంది అని తెలిసింది. అయితే దానిలో ఇంకా ఎంత మేర నిజముందో కానీ ఈ చిత్రం సెన్సార్ వర్క్ ను కంప్లీట్ చేసుకున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా యూ/ఏ సర్టిఫికెట్ ను సెన్సార్ వర్గాల నుంచి పొంది రిలీజ్ కి రెడీ అయ్యినట్టు కన్ఫర్మ్ అయ్యింది.

మరి ఈ చిత్రం థియేట్రికల్ గా వస్తుందా లేక ఓటిటి లోనే వస్తుందా అన్నది ఇంకా కన్ఫర్మ్ అవ్వాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో ప్రియమణి హీరోయిన్ గా నటించగా మణిశర్మ సంగీతం అందించారు. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ లోనే ఈ చిత్రం కూడా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :