యాక్టర్‌గా రానా చాలా ఎదిగాడు – విక్ట‌రి వెంక‌టేష్‌

యాక్టర్‌గా రానా చాలా ఎదిగాడు – విక్ట‌రి వెంక‌టేష్‌

Published on Mar 21, 2021 7:04 PM IST

రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో ప్రభు సాల్మన్‌ దర్శకత్వం వ‌హిస్తున్న చిత్రం ‘అరణ్య. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో విష్ణు విశాల్‌, జోయా హుస్సేన్‌, శ్రీయ కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ మూవీ హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాదన్’ పేర్లతో విడుదల కానుంది. శాంతను సంగీతం అందించిన ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్బంగా హైదరాబాద్ పార్క్ హ‌యాత్ హోట‌ల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్‌. ముఖ్య అతిథిగా హాజ‌రైన విక్ట‌రి వెంక‌టేష్ అర‌ణ్య మూవీ స్పెష‌ల్ ప్రోమోని రిలీజ్ చేశారు.

రానా ద‌గ్గుబాటి మాట్లాడుతూ – “కెమెరా ముందు ఒక వ్య‌క్తి ఎలా ఉండాలో నాకు నేర్పించింది శేఖ‌ర్ క‌మ్ములగారు ఆయ‌న కార్య‌క్ర‌మానికి రావ‌డం హ్యాపీగా ఉంది. నేను చాలా యాక్టింగ్ నేర్చుకున్నాను అని చెప్ప‌డానికి ఆయ‌న్ని ఇక్క‌డికి పిలిచాను (న‌వ్వుతూ). సాయి మాధ‌వ్‌గారు, క్రిష్‌గారు క‌లిసి కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్ సినిమాలో మొత్తం భాగవత తత్వం నేర్పించారు. ఆ సినిమాలో సాయి మాధ‌వ్ గారు రాసిన ఒక లైన్ నా జీవితాంతం మిగిలిపోయింది అది ఏంటంటే `చ‌ప్ప‌ట్లంటే వ్య‌స‌నం..ఆ చప్ప‌ట్ల మ‌ధ్య‌న ఒక్క‌డుంటాడు..దీన‌మ్మ ఇది నిజ‌మే క‌దా అని చూస్తుంటాడు..ఆ ఒక్క‌డికోసం నువ్వు నాట‌కం ఆడు“ అని ఇప్పుడు ఆ ఒక్క‌డి కోస‌మే ఈ సినిమా కూడా చేశాను అని అన్నారు.

విక్ట‌రి వెంకటేష్‌ మాట్లాడుతూ – ‘‘ప్రకృతితోనే మన జీవితాలు ముడిపడి ఉన్నాయి. అందుకే ప్రకృతి పట్ల మనం అందరం బాధ్యతగా ఉండాలి. మనం ప్రకృతితో ఆడుకుంటే ఏం జరుగుతుందో మనందరికి తెలుసు. శనివారం అరణ్య సినిమా చూశాను. అరణ్య సినిమా మనం అందరం గర్వపడేలా ఉంది. లీడర్, ఘాజీ, బాహుబలి వంటి సినిమాల్లో రానా విభిన్నమైన పాత్రలు పోషించాడు. తన జర్నీలో యాక్టర్‌గా నేర్చుకుంటున్నాడు అనుకున్నాను. కానీ అరణ్య సినిమాలోని పాత్రలో రానా ఒదిగిపోయిన తీరు చూస్తుంటే …యాక్టర్‌గా రానా చాలా ఎదిగాడని అనిపిస్తుంది. అరణ్య సినిమాలోని ఫస్ట్‌ ప్రేమ్‌ నుంచే రానా పెర్ఫార్మెన్స్‌ చూసి నేను స్టన్‌ అయ్యాను. ఇండియన్‌ స్క్రీన్‌పై ఓ సరికొత్త పాత్రను రానా చేశాడు. ఇలాంటి సబ్జెక్ట్‌ను ఎంచుకున్న రానాను అభినందిస్తున్నాను. రానా బాడీ లాంగ్వేజ్‌ కూడ పాత్ర సరిపోయింది. అరణ్య సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి“ అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు