అనుకున్నట్టే వెంకీ సినిమాను ఓటీటీకే విక్రయించేశారు

Published on Jun 29, 2021 11:39 pm IST

ఇటీవల అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైన చిత్రాల్లో మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం 2’ మంచి విజయాన్ని అందుకుంది. ‘దృశ్యం’ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ సినిమాను తెలుగులో విక్టరీ వెంకటేష్ రీమేక్ చేస్తున్నారు. వెంకీ గతంలో ‘దృశ్యం’ను కూడ రీమేక్ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. అందుకే పార్ట్ 2 కూడ రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ మొత్తం పూర్తైంది. డైరెక్టర్ జీతూ జోసెఫ్ చాలా తక్కువ రోజుల్లోనే సినిమాను పూర్తి చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రాజెక్ట్ మొదలుపెట్టేటప్పుడే ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నారు టీమ్.

ఆ మేరకే ఓటీటీ డీల్ క్లోజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్ స్టార్ సినిమా యొక్క శాటిలైట్, డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. త్వరలోనే విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు. పూర్తి హక్కులు ఓటీటీ సొంతం చేసుకోవడంతో థియేట్రికల్ రిలీజ్ ఉండదు. మరోవైపు వెంకీ చేసిన ‘నారప్ప’ను కూడ ఓటీటీ ద్వారా విడుదల చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులు ఎంత ఆలస్యమైనా ‘నారప్ప’ను థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్మాత సురేష్ బాబును కోరుతున్నారు.

సంబంధిత సమాచారం :