షాడోలో నాటీ గర్ల్ గా కనిపించనున్న తాప్సీ

షాడోలో నాటీ గర్ల్ గా కనిపించనున్న తాప్సీ

Published on Mar 11, 2013 11:30 PM IST

taapsee

విక్టరీ వెంకటేష్, తాప్సీ జంటగా నటిస్తున్న ‘షాడో’ సినిమా చివరి షెడ్యూల్ మొదలైంది. ప్రస్తుతం వీరిద్దరి మధ్యా ఒక పాటని చిత్రీకరిస్తున్నారు. ‘నాటీ గర్ల్’ అంటూ సాగే ఈ పాటని సింహా మరియు గీతా మాధురి ఆలపించారు. ఆర్ట్ డైరెక్టర్ ఏ. ఎస్ ప్రకాష్ వేసిన సెట్లో తీస్తున్న ఈ పాటకి రాజు కొరియోగ్రాఫర్. సి.సి.ఎల్-3 లో నిన్నటిదాకా బిజీగా ఉన్న వెంకటేష్ ఈరోజు నుండి షూటింగ్లో పాల్గొంటున్నాడు. “మైమరిపించే మరో షెడ్యూల్ షాడో సాంగ్ తో మొదలైంది. చాలా ఎనర్జిటిక్ సాంగ్… నాటీ గర్ల్!!!! ” అని తాప్సీ ట్వీట్ చేసింది.

ఈ సినిమా ఆడియో మార్చి 15న విడుదలకానుంది. శ్రీకాంత్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకు గోపీ మోహన్ కధ అందించాడు. యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై పరుచూరి ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. థమన్ సంగీత దర్శకుడు. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కావచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు