వెంకటేష్, తేజ సినిమా లేటెస్ట్ న్యూస్!
Published on Mar 1, 2018 8:20 am IST

నేనే రాజు నేనే మంత్రి తరువాత తేజ దర్శకత్వం వహిస్తోన్న సినిమాలో వెంకటేష్ హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆట నాదే వేట నాదే అనే టైటిల్ ఈ సినిమాకు పరిశీలనలో ఉంది. మర్చి 12 నుండి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మొదలుకానుంది. వెంకటేష్ నటిస్తోన్న 72వ సినిమా ఇది. అలాగే శ్రియకి కూడా ఇది 72వ సినిమా అవ్వడం విశేషం. యాదృచ్చికంగా ఇద్దరు ఒక సినిమాలో నటించబోతున్నారు.

అనుప్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు అభినవ్ రామానుజం సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. గురు సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని వెంకటేష్ చేస్తున్న సినిమా ఇది. నారా రోహిత్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో దాదాపు కొత్త నటీనటులు నటిస్తున్నారు. సురేష్ బాబు, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 
Like us on Facebook