వచ్చే ఏడాది మూడు సినిమాలతో రానున్న సీనియర్ హీరో !

వచ్చే ఏడాది మూడు సినిమాలతో రానున్న సీనియర్ హీరో !

Published on Nov 4, 2018 9:08 PM IST


సీనియర్ అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ గత ఏడాది ‘గురు’ చిత్రం తో ప్రేక్షకులను పలకరించాడు. ఈచిత్రం తరువాత కొంత గ్యాప్ తీసుకొని వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇక ఈ ఏడాది ఆయన నటించిన ఒక్క చిత్రం కూడా విడుదలఅవ్వడం లేదని ఆయన అభిమానులు నిరాశ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వచ్చే ఏడాది ఏకంగా మూడు సినిమాలతో థియేటర్లలో సందడి చేయనున్నాడు వెంకీ.

వెంకీ ప్రస్తుతం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘ఎఫ్ 2’ అనే చిత్రంలో వరుణ్ తేజ్ తో కలిసి నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో వున్న ఈ చిత్రం సంక్రాంతి కి విడుదల కానుంది. ఇక ఈచిత్రం తరువాత వెంకీ , బాబీ దర్శకత్వంలో నాగ చైతన్య తో కలిసి ‘వెంకీ మామ’ చిత్రంలో నటించనున్నాడు. ఈచిత్ర షూటింగ్ వచ్చే నెలలో మొదలు కానుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో విడుదలకానుంది.

ఇక ఈ రెండు చిత్రాలతో పాటు వెంకీ, త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో సోలో హీరోగా ఒక సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది చివర్లో విడుదలకానుంది. ఇలా మూడు సినిమాలతో వెంకీ వచ్చే ఏడాది అభిమానులకు ట్రిపుల్ ధమాకా ఇవ్వనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు