వెంకీ అట్లూరి అఖిల్ తో సినిమా చెయ్యబోతున్నడా ?

వెంకీ అట్లూరి అఖిల్ తో సినిమా చెయ్యబోతున్నడా ?

Published on Feb 25, 2018 8:30 PM IST

వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో వరుణ్ తేజ్ సక్సెస్ అందుకున్నాడు. తమన్ సంగీతం ఈ మూవీకి పెద్ద ప్లస్ అయ్యింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన అన్ని థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ మూవీ తరువాత వెంకి అట్లూరి చెయ్యబోయే తదుపరి సినిమాపై కొన్ని వార్తలు వస్తున్నాయి.

అఖిల్ చెయ్యబోయే తదుపరి సినిమా వెంకి అట్లూరి తో ఉండబోతోందని సమాచారం. బివిఎస్ఎన్ప్రసాద్ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లువార్తలు వస్తున్నాయి. అధికారికంగా ఈ ప్రాజెక్ట్ పై ప్రకటన లేకపోయినా బయట ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. మరికొన్ని రోజుల్లో క్లారిటివచ్చే అవకాశం ఉంది. వరుణ్ తేజ్ ఈ మూవీ తరువాత సంకల్ప్రెడ్డి దర్శకత్వంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు