మరో ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ లో ‘వెంకీ’ !

Published on May 9, 2019 11:00 pm IST

నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ చెయ్యబోయే సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తి అయిందట. వెంకీ మామ షూటింగ్ పూర్తయ్యాక ఈ సినిమా మొదలుకానుంది. ఇక ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని… సినిమాలో వెంకేటేష్ క్యారెక్టరైజేషన్ మంచి కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ఉంటుందని సమాచారం.

త్రినాథరావ్ నక్కిన గత చిత్రాలు కూడా ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్ వంటి సినిమాలు మంచి ఎంటెర్టైమెంట్ తో సాగిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను సురేష్ బాబు నిర్మిస్తారు. ప్రస్తుతం వెంకీ బాబీ దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగచైతన్య కాంబినేషన్ లో ‘వెంకీ మామ’ మల్టీ స్టారర్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే కీలక షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది.

సంబంధిత సమాచారం :

More