‘వెంకీ మామ’ లేటెస్ట్ అప్ డేట్ !

‘వెంకీ మామ’ లేటెస్ట్ అప్ డేట్ !

Published on Jun 4, 2019 9:30 AM IST

‘జై లవ కుశ ‘ చిత్ర డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వెంకీ – చైతు కాంబినేషన్ లో ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న మల్టీ స్టారర్ ‘వెంకీ మామ’. కాగా ఈ చిత్రం షూటింగ్ రెండు వారాల నుంచి, కాశ్మీర్ లో కొన్ని కీలకమైన ఆర్మీ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలను చిత్రీకరించారు. జూన్ 13న ఈ షెడ్యూల్ పూర్తి కానుంది. అయితే తరువాత షెడ్యూల్ హైదరాబాద్ లో గ్యాప్ లేకుండా షూట్ చేయనున్నారు. ఈ హైదరాబాద్ షెడ్యూల్ తో సినిమాలో కీలక భాగం పూర్తవుతుంది.

ఇక గతంలో ‘ప్రేమమ్’ సినిమాలో కొద్దిసేపు స్క్రీన్ షేర్ చేసుకున్న మామ అల్లుళ్లు ఇప్పుడు ఫుల్ లెంగ్త్ సినిమాలో నటిస్తున్నారు. దాంతో ఈ సినిమా పై అందరిలోనూ ఆసక్తి అమాంతం పెరిగింది. కాగా ఈ సినిమాలో వెంకీ సరసన బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా.. నాగ చైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు