వెంకీ చైతుతో హిట్ కొట్టడం ఖాయం అంట !

వెంకీ చైతుతో హిట్ కొట్టడం ఖాయం అంట !

Published on Mar 31, 2019 8:25 PM IST

వెంకీ – చైతు కలయికలో ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న మల్టీ స్టారర్ ‘వెంకీ మామ’. గతంలోనే ‘ప్రేమమ్’ సినిమాలో కొద్దిసేపు స్క్రీన్ షేర్ చేసుకున్న మామ అల్లుళ్లు ఇప్పుడు ఫుల్ లెంగ్త్ సినిమాలో నటిస్తున్నారు. దాంతో ఈ సినిమా పై అందరిలోనూ ఆసక్తి అమాంతం పెరిగింది. ఇక ఈ చిత్రంలో వెంకటేష్ క్యారెక్టర్ చాలా ఇంట్రస్ట్ గా ఉండనుందట. పల్లెటూరిలో రైసు మిల్లు నడుపుకునే వ్యక్తి పాత్రలో వెంకీ ఈ సినిమాలో కనిపించనున్నాడు. నాగచైతన్య వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చే ఆ పల్లెటూరి సన్నివేశాలు చాలా బాగా అలరిస్తాయట.

ఇప్పటికే ఆ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారట. ‘మామ అల్లుళ్లు’ ఇద్దరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటుస్తున్నారని.. ఇద్దరి మధ్య కామెడీ టైమింగ్ చాలా బాగా కుదురుతుందని, దీంతో వెంకీ చైతుతో హిట్ కొట్టడం ఖాయం అని తెలుస్తోంది. కాగా ‘జై లవ కుశ ‘ చిత్ర డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి కోన వెంకట్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు