వెంకీ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నాడట !

Published on Jul 7, 2018 10:14 am IST


సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ‘గురు’ చిత్రం తరువాత కొంత విరామం తీసుకొని ఇటీవల వరుస గా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. దాంట్లో భాగంగా ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్ 2’ అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్ర షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇక ఈ చిత్రం తరువాత బాబీ దర్శకత్వంలో నాగ చైతన్య తో కలిసి మరో మల్టీ స్టారర్ చిత్రంలో నటించనునున్నాడు.

వీటితో పాటు ఆయన సోలో హీరో గా ‘నేను లోకల్’ చిత్ర దర్శకుడు త్రినాథ రావు నక్కిన తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నాడు.
ఇక ఈచిత్రంలో వెంకీ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నాడని సమాచారం. ఇంతకుముందు , ఘర్షణ , బాబు బంగారం వంటి తదితర చిత్రాల్లో ఆయన పోలీస్ ఆఫీసర్ గా నటించారు. పక్క కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంభందించిన వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం :