వెంకీమామ టీం సప్రైజ్ ఇవ్వనుంది !

Published on Apr 5, 2019 1:24 pm IST

బాబీ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ వెంకీమామ ఇటీవలే రాజమండ్రి లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం యొక్క రెండవ షెడ్యూల్ ఏప్రిల్ 8న సార్ట్ కానుంది. ఇక ఉగాది కానుకగా ఈ రోజు సాయంత్రం 4:05గంటలకు ఈచిత్రం యొక్క టైటిల్ లోగో ను విడుదలచేయనున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకీ కి జోడిగా పాయల్ రాజ్ పుత్ అలాగే నాగ చైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది.

కోన ఫిలిం కార్పొరేషన్ , సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టు లో ఈ చిత్రాన్ని పూర్తి చేసి దసరా సీజన్ లో విడుదలచేసేలా సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :