ఫిలింనగర్ ప్రాంతంలో అక్రమ నిర్మాణ నేపధ్యంలో జి.హెచ్.ఎం.సి నుండి సినీ నటుడు వెంకటేష్ కి నోటీసులు రావడం పెద్ద సంచలానానికి దారితీసింది. అయితే ఈ విషయం పై వెంకీ ఆఫీస్ నుండి అధికారిక ప్రెస్ మీట్ విడుదల చేసారు. ఆ స్థలాన్ని మున్నా యునైటెడ్ హాస్పటాలిటి సర్వీసెస్ పేరుమీద ప్రమోద్ కుమార్ అనే వ్యక్తికీ ఈ ఏడాది సెప్టెంబర్ లో లీజ్ కి ఇచ్చారట. అయితే ఈ నోటీసు నవంబర్ లో వచ్చినందున వెంకటేష్ తప్పు లేదని తెలుపుతున్నారు
వెంకటేష్ ఇటీవలే దృశ్యం సినిమాతో హిట్ సాధించి మంచి ఆనందంలో వున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ తో కలిసి ‘గోపాల గోపాల’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి మనముందుకు రానుంది


