వెంకటేష్ కుమార్తె వివాహం చేసుకోబోతుందా ?

Published on Sep 22, 2018 7:45 pm IST

తెలుగు సినీ పరిశ్రమలో ప్రేమ వివాహాలు కొత్తేమి కాదు. కానీ కొంతమంది ప్రముఖుల కుటుంబాలలోని ప్రేమ వివాహాలు ప్రేక్షకులకు చాలా ఆసక్తిని కలిగిస్తాయి. ఎందుకంటే ఆ ప్రముఖులు బయట ప్రపంచానికి పెద్దగా ఎక్కడా కనబడరు. కాగా ఇప్పుడు అలాంటి ప్రేమ వివాహం సంగతే ఒకటి బయటికి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. విక్టరీ వెంకటేష్ కుమార్తె ఆశ్రిత ప్రేమ వివాహం చేసుకోనున్నారని సమాచారం.

హైదరాబాద్ రేస్ క్లబ్ ఛైర్మన్ సురేందర్ రెడ్డిగారి మనవడితో ఆశ్రిత వివాహం జరగబోతుందని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వెంకటేష్ సోదరుడు, సీనియర్ నిర్మాత సురేష్ బాబు ఇటీవలే అబ్బాయి కుటుంబాన్ని సందర్శించారని.. కొన్ని రోజుల్లో ఇరు కుటుంబాలు కూర్చుని నిశ్చితార్థం తేదీని ఖరారు చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయానికి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

సంబంధిత సమాచారం :