వెన్నెల కిషోర్ కి ‘మెంటల్’ అట !

వెన్నెల కిషోర్ కి ‘మెంటల్’ అట !

Published on Nov 7, 2018 4:00 AM IST

తెలుగు స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. తన సినిమాలకు సంబంధించి, షూటింగ్ లోని సంఘటనల గురించి ఎప్పటికప్పుడు తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటుంటాడు. దీనికి తోడు అభిమానులు పెట్టిన ట్వీట్ లకు, ఫన్నీగా రీట్వీట్ లు కూడా పెడుతుంటాడు ఆయన.

కాగా తాజాగా మరో ట్వీట్‌తో వెన్నెల కిషోర్ నెటిజన్లను నవ్వించాడు. ‘వర్కౌట్ చెయ్యక ముందే నువ్వు ఫిల్టర్ చేయని గ్లో లా ఎప్పుడు ఉంటావంటే.. నీ ట్రైనర్‌కు ఒక రోజు సెలవు తీసుకోవాల్సి వచ్చినపుడు..’’ అని ఫన్నీగా పోస్ట్ చేశాడు. అయితే ఈ పోస్ట్ చూసిన మంచు లక్ష్మి ‘మెంటల్’ అని నవ్వుతూ కామెంట్ పెట్టింది. మొత్తానికి వెన్నెల కిషోర్ సినిమాల్లోనే కాకుండా, బయట కూడా బాగానే నవ్విస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు