డైరెక్షన్ చేయబోతున్న స్టార్ కమెడియన్ !

డైరెక్షన్ చేయబోతున్న స్టార్ కమెడియన్ !

Published on Jul 18, 2021 12:38 AM IST

స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ గతంలో డైరెక్షన్ కూడా చేశాడు. అయితే, తాజాగా ఈ స్టార్ కమెడియన్ మళ్ళీ డైరెక్షన్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే డైరెక్ట్ చేయబోయేది సినిమా కాదట, ఒక వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఆహా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ కోసం అల్లు అరవింద్ యువ చిత్రనిర్మాతలతో పాటు డైరెక్టర్స్ తో సహా ‘ఆహా’ కోసం ఒరిజినల్ షోలు మరియు చిన్న చిత్రాలను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం వెన్నెల కిషోర్ డైరెక్ట్ చేయబోతున్న వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ గా వెన్నెల కిశోరే నటిస్తోన్నాడట. ఇక భవిష్యత్ మొత్తం డిజిటల్ మీడియాదే అని అందరూ నమ్ముతున్నారు. ఓ వైపు థియేటర్స్ ఓపెన్ అవుతున్నా ఓటిటి ప్లాట్ ఫామ్స్ ను నటీనటులు ఇంకా టార్గెట్ చేస్తూనే ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు