‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ నటిస్తున్న రెండవ చిత్రం ‘హిప్పీ’ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. తెలుగు , తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈచిత్రానికి తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రముఖ తెలుగు హాస్య నటుడు వెన్నల కిషోర్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం అయన ఫై కొన్ని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా కిశోర్ సెట్ లో దిగిన ఫొటోను సోషల్ మీడియా లో షేర్ చేశారు.
‘మల్లన్న , తెరి , కబాలి’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించిన నిర్మాత కలై పులి ఎస్ తాను ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. నివాస్ ప్రసన్న సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి రాజశేఖర్ ఛాయాగ్రహణం అందిస్తున్నాడు.
On #Hippie Setshttps://t.co/Bk08a2xd8F pic.twitter.com/WZ6oxgHSLA
— vennela kishore (@vennelakishore) November 28, 2018


