‘భారతీయుడు 2’లో తెలుగు స్టార్ కమెడియన్ !

‘భారతీయుడు 2’లో తెలుగు స్టార్ కమెడియన్ !

Published on Nov 18, 2018 11:22 AM IST

స్టార్‌ డైరెక్టర్ శంకర్‌ – కమల్‌ హాసన్‌ ల కలయికలో 1996లో వచ్చిన భారతీయుడు చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం దర్శకుడు శంకర్‌ భారతీయుడు సీక్వెల్‌ ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

కాగా ఈ చిత్రంలో ఇప్పటికే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ్ హీరో శింబు కీలక పాత్రల్లో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రముఖ తెలుగు స్టార్ కమెడియన్ వెన్నల కిషోర్ కూడా భారతీయుడు 2లో ఓ కామిక్ పాత్ర పోషించనున్నాడని తెలుస్తోంది.

వెన్నల కిషోర్ తెలుగుతో పాటు తమిళ వెర్షన్ లో కూడ కనిపిస్తారట. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్ముస్తోంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు