వేణు శ్రీరామ్ వేరే దారి వెతుక్కున్నారా ?

Published on May 17, 2021 11:00 pm IST

‘వకీల్ సాబ్’ సినిమాతో దర్శకుడు వేణు శ్రీరామ్ మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయ్యారు. నిర్మాత దిల్ రాజు సైతం వేణు శ్రీరామ్ వర్క్ పట్ల బాగా ఇంప్రెస్ అయ్యారు. వెంటనే అల్లు అర్జున్ హీరోగా ఎప్పుడో అనౌన్స్ చేసిన ‘ఐకాన్’ చిత్రాన్ని మళ్లీ బయటకు తీశారు. సినిమా తప్పకుండా ఉంటుందని, త్వరలోనే మొదలవుతుందని, బన్నీయే హీరో అని అన్నారు. కానీ ఆతర్వాత పరిణామాలు మారాయి. ‘ఐకాన్’ ఇప్పుడప్పుడే పట్టాలెక్కే సూచనలు కనిపించట్లేదు. అల్లు అర్జున్ ప్లాన్స్ కూడ వేరేలా ఉన్నాయి.

దీంతో వేణు శ్రీరామ్ అంత సమయం వేచి చూసే బదులు వేరే సినిమా చేసుకోవాలని భావిస్తున్నారట.
అందుకే వేరే హీరోకి కథ చెప్పి ఓకే చేయించుకునే పనిలో ఉన్నారట. దాదాపు ప్రాజెక్ట్ సెట్ అయినట్టే అని ఫిల్మ్ నగర్ టాక్. అది కూడ స్టార్ హీరోతోనే ఉంటుందని తెలుస్తోంది. మరి ఆ స్టార్ హీరో ఎవరు, సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే వివరాలు తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. వేణు శ్రీరామ్ పవన్ ఒప్పుకుంటే ‘వకీల్ సాబ్-2’ కూడ తీయాలని అనుకుంటున్నారు. ఇకపోతే దిల్ రాజు సైతం రామ్ చరణ్, శంకర్ సినిమాను మొదలుపెట్టే పనుల్లో ఉన్నారు.

సంబంధిత సమాచారం :