మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం ‘నేల టికెట్టు’. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తైపోయింది. దీంతో యూనిట్ ఆడియో వేడుకకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ నెల 10న ఈ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు.
ఈ వేడుకను హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో ఉన్న పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్నారు. పవన్ చీఫ్ గెస్ట్ కానుండటంతో ఆధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశాలున్నాయి. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవిక శర్మ కథానాయకిగా నటిస్తోంది. ఇకపోతే రవితేజ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సైన్ చేసిన ‘తేరి’ తెలుగు రీమేక్ షూటింగ్లో ఈరోజు నుండి పాల్గొంటారని సమాచారం.


