‘విజేత’ ఆడియో వేడుకకు వేదిక ఫిక్సైంది !
Published on Jun 23, 2018 5:21 pm IST

మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతూ చేసిన చిత్రం ‘విజేత’. ఈ చిత్రం యొక్క ఆడియో వేడుక రేపు ఘనంగా జరగనుంది. హైదరాబాద్లోని జే.ఆర్.సి కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరుకానుండగా మెగా హీరోలు రామ్ చరణ్, ఆలు అర్జున్ సైతం వేడుకకు రానున్నారు.

ఇప్పటికే విడుదలైన ‘కొక్కొరొకో’ పాట శ్రోతలను ఆకట్టుకోగా లుక్స్ పరంగా కళ్యాణ్ దేవ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుండటం, టీజర్ కూడ ధీమాను కలిగించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా మాళవికా శర్మ కథానాయకిగా నటిస్తోంది. వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు రాకేష్ శశి డైరెక్ట్ చేస్తున్నాడు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook