వర్మని బుక్ చేసిన గణపతి కామెంట్స్

వర్మని బుక్ చేసిన గణపతి కామెంట్స్

Published on Sep 2, 2014 1:26 PM IST

ram-gopal-varma
విలక్షణ మరియు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పటి కప్పుడు వార్తల్లో నిలవడానికి ప్రతి అకేషన్ ని వాడుకొని వివాదాస్పద వాఖ్యలు చేస్తుంటాడు. తాజాగా వినాయక చవితి సందర్భంగా వినాయకుడి మీద కొన్ని కమెంట్స్ చేసాడు. అవే ఇప్పుడు వరమని చిక్కుల్లో పడేశాయి. కరుణ సాగర్ అనే ఓ లాయర్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో వర్మపై కేసు రిజిస్టర్ చేసాడు.

సరూర్ నగర్ ఇన్స్పెక్టర్ బి. నవీన్ రెడ్డి చెప్పిన సమాచారం ప్రకారం ఇండిన పీనల్ కోడ్ లోని సెక్షన్స్ 153A (ఇరువర్గాల మధ్య వైరాన్ని పెంచడం), 504(శాంతి ని భగ్నం చేసేలా కామెంట్ చేయడం), 505(పబ్లిక్ ని మధ్య అల్లర్లు సృష్టించే స్టేట్ మెంట్స్) మరియు 298(మతపరమైన భావాలను కించపరచడం) సెక్షన్స్ కింద కేసు నమోదు చేసారని తెలిపారు.

లాయర్ కరుణ సాగర్ తో పాటు ముంబైలోని పలువు పోలీసులు కూడా రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ పై కేసు నమోదు చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు