టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్, పవర్ స్టార్ కోసం ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడట. అయితే తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్ కి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఏమిటంటే.. ఈ సినిమాలో కూడా పవర్ స్టార్ కొన్ని నిముషాల పాటు ఐబీ ఆఫీసర్ గా కనిపిస్తారని.. అయితే క్లైమాక్స్ సీక్వెన్స్ లో మాత్రమే పవన్ ఐబీ ఆఫీసర్ అనే విషయం రివీల్ అవుతుందని తెలుస్తోంది. ఇక గతంలో హరీష్, పవన్ కాంబినేషన్లో వచ్చిన పోలీస్ డ్రామా ‘గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది.
కాగా అప్పటికే వరుస ప్లాప్స్ లో ఉన్న పవన్.. గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు హరీష్ – పవన్ చేయబోతున్న సినిమాలో కూడా ఐబీ సీక్వెన్స్ ఉందనే సరికి ఈ సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి . పైగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే అంశాలన్ని ఈ సినిమాలో ఉంటాయనే నమ్మకం ఉంది. ఆ కారణంగా ఈ సినిమా పై ఫ్యాన్స్ బాగా ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో కథానాయకిగా పూజా హెగ్డే నటించే అవకాశం ఉందట. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’తో క్రిష్ సినిమా కూడా చేస్తున్నాడు. క్రిష్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మొదటిసారి పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తవగానే హరీష్ శంకర్ చిత్రం మొదలుకానుంది.


