పుకార్లను ఖండించిన రవితేజ చిత్ర దర్శకుడు !

పుకార్లను ఖండించిన రవితేజ చిత్ర దర్శకుడు !

Published on Jun 27, 2018 1:05 PM IST

Vi Anand

మాస్ మహారాజ రవితేజ త్వరలో విని ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. రాబోయే దసరా నుండి ఈ చిత్రం మొదలయ్యే అవకాశాలున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో ‘నేల టిక్కెట్టు’ ఫేమ్ మాళవిక శర్మ కథానాయకిగా నటించనుందని వార్తలొస్తున్నాయి.

వీటిపై స్పందించిన దర్శకుడు విఐ ఆనంద్ ఆ వార్తల్లో నిజం లేదని తేల్చేశారట. అంతేగాక కథ ప్రకారం సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, ఇంకా ఎవర్నీ ఫైనల్ చేయలేదని కూడ తెలిపారట. ఇకపోతే రవి తేజ ప్రస్తుతం శ్రీను వైట్లతో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా చేస్తూ అది పూర్తవగానే సంతోష్ శ్రీనివాస్ తో ‘తేరి’ రీమేక్ ను మొదలుపెట్టనున్నారు. ఈ రెండు చిత్రాల్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు