రవితేజ ఎన్నో ఆశలతో చేస్తున్న చిత్రం ‘డిస్కో రాజా’. విఐ అనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. అలా అని ఇందులో మాస్ మహారాజ ట్రేడ్ మార్క్ వినోదం లేకుండా ఉండదు. అది కూడా కావాల్సినంత ఉంటుందట. అంతేకాదు యాక్షన్, ఎమోషన్ కూడా సమపాళ్లలో ఉంటాయని దర్శకుడు విఐ ఆనంద్ అంటున్నారు.
ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలో రవితేజ పాత్రను షూటింగ్ సమయంలో చూస్తున్నప్పుడే తాము ఎంతో ఎగ్జైట్ అయ్యామని, సినిమా చూస్తే అలాంటి భావనే ప్రేక్షకులకు కూడా కలుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా టీజర్ డిసెంబర్ 6వ తేదీన విడుదలకానుంది. ఈ సినిమాను ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్‌లో నటిస్తుండగా బాబీ సింహ ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రేక్షకులకు అందివ్వనున్నారు. ఇందులో నాభ నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్య హోప్ కథానాయికలుగా నటిస్తున్నారు.
