ఇంటర్వ్యూ : ‘విక్టరీ’ వెంకటేష్ – “నారప్ప” రీమేక్ అందుకే చేశా..

Published on Jul 17, 2021 2:12 pm IST

అందరి ఫేవరెట్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా ప్రియమణి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “నారప్ప”. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ చిత్రం పలు కారణాల చేత ఈ నెల 20న డైరెక్ట్ గా దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలకు సిద్ధంగా ఉంది. మరి ఈ సందర్భంగా వెంకీ మామ ఒక ఎనర్జిటిక్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి ఎలాంటి విషయాలు పంచుకున్నారో చూద్దాం రండి.

మీకు ఇది మొదటి ఓటిటి రిలీజ్ సర్ దానిపై మీ స్పందన ఏంటి.?

(నవ్వుతూ) అవును ఎవరికైనా కొన్ని ఫస్ట్ థింగ్స్ ఉంటాయి కదమ్మా, అలాగే ఇది కూడా నా లైఫ్ లో ఇది కూడా మొదటి సారే అనుకుంటాను.

ఈ సినిమా ఓటిటి రిలీజ్ పై మీ ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యినట్టు ఉన్నారు?

కొన్ని సార్లు చాలా మంది కొన్ని విషయాల్లో డిజప్పాయింట్ అవుతారు, అలాగే నా సినిమా విషయంలో కూడా నా ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. కానీ టైం వల్ల ఇలా జరిగింది ఎప్పటి నుంచి నన్ను కానీ నా సినిమాలని కానీ ఉన్నారు వారందరికీ నారప్ప సినిమా రిలీజ్ పై చాలా సిన్సియర్ గా సారీ చెప్తున్నాను. నా సినిమా వర్క్ కోసం అందరికీ తెలుసు సో అందరూ ఈ ఒక్క విషయంలో అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నాను. అలాంటి అభిమానులు నాకు దక్కడం నిజంగా అదృష్టంగా భావిస్తాను.

‘నారప్ప’ సినిమా చెయ్యడానికి మీకు ఏ అంశం బాగా నచ్చింది?

మొదటిగా నేను ధనుష్, కి వెట్రిమారన్ కి కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన స్క్రిప్ట్ ని హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్ ఉన్న సినిమా ఇచ్చినందుకు. ఇది చూసిన వెంటనే నాకు చాలా నచ్చేసింది నాకే ఛాలెంజింగ్ గా ఉంటుంది అనిపించింది. అందుకే నా కెరీర్ రీమేక్ సినిమాలు ఎక్కువ కనిపిస్తాయి. అందరూ అదే అడుగుతారు ఎందుకు రీమేక్ సినిమాలు ఎక్కువ అని. నేనేమి కావాలని చెయ్యను అలా జరుగుతుంది అంతే. అలా అని రీమేక్స్ చెయ్యడం అనేది చిన్న విషయం కూడా కాదు ఆల్రెడీ హిట్టయిన సినిమాని వారి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా మళ్ళీ హిట్టయ్యేలా చెయ్యడం అనేది చాలా రిస్క్ తో కూడుకుంది. అందుకే నేను చేస్తా.

మరి ‘నారప్ప’ మీకెంత ఛాలెంజింగ్ గా అనిపించింది?

నిజంగా నారప్ప నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది. చాలా కాలం తర్వాత సాలిడ్ ఎమోషన్స్ కానీ ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లు కానీ, గెటప్ అన్నీ చాలా ఛాలెంజింగ్ గా అనిపించాయి. నేను అలాంటి యాక్టర్ ని కాదు కానీ ఈ సినిమాకి ఎందుకో అలా చేయాలనిపించింది. ఒక 50 రోజులు అదే ఓ కాస్ట్యూమ్ తో హోటల్ రూమ్ లో ఉన్నాను.

ఒరిజినల్ కి ‘నారప్ప’ కి కంపేరిజన్స్ ఏమన్నా ఉన్నాయా?

ఖచ్చితంగా.. ఏ రీమేక్ సినిమాకి అయినా కంపేరిజన్ అనేది ఉంటుంది. నా సినిమాలు సుందరాకాండ, చంటి సినిమాల నుంచే చాలానే మార్పులు ఉంటాయి. అలాగే నారప్ప కి కూడా కావాల్సిన చేంజెస్ చాలానే చేసాం. అలాగే సినిమాలో అందరు యాక్టర్స్ కూడా చాలా బాగా చేసారు అది రేపు మీకు కనిపిస్తుంది.

ముందు మీ యంగ్ రోల్ కి చాలా మంది యాక్టర్స్ పేర్లు వినిపించాయి, రానా చేస్తున్నాడని కూడా..?

ఎలా చేస్తాడమ్మా ఇలాంటి వాటిలో? అలా ఏమి లేదు అవన్నీ జస్ట్ టాక్స్ మాత్రమే అవన్నీ ఎవరో అనడం మళ్ళీ మీరు నన్ను అడగడం. అలా ఏమి మేము అనుకోలేదు.

‘అసురన్’ లో ధనుష్ కి నారప్ప లో మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది దాన్ని ఎలా చూపించగలరు?

ఏదైనా సరే ఫైనల్ గా అతను ధనుష్, నేను వెంకటేష్. అతను కూడా అవుట్ స్టాండింగ్ జాబ్ ఇచ్చాడు. ఇక్కడ నారప్ప ఎమోషన్స్ ఏంటి అన్నది ముఖ్యం అది నేను చూపించాను అందుకే కదా అన్నా చాలా కష్టంగా ఈ రోల్ అనిపించింది అని.

మణిశర్మ గారి సంగీతం కోసం ఏమన్నా చెప్పండి?

మణి తో నా మొదటి సినిమా నుంచి కూడా మంచి మ్యూజిక్ ఇస్తూనే ఉన్నాడు, అలాగే ఈ సినిమాకి కూడా మంచి స్కోర్ ఇచ్చాడు.

గడిచిన కొన్నేళ్లలో కొత్త కథలు వస్తున్నాయి రీమేక్స్ అవసరం లేదు అన్నది కొందరి మాట..

ఎవరన్నారు? నా వరకు అయితే రాలేదు. మనం చేసేది ఏదైనా సరే కరెక్ట్ గా సిన్సియర్ గా చేసుకెళ్లిపోవాలని నేను అనుకుంటా.

ఇప్పుడు నడుస్తున్న ఓటిటి డామినెన్స్ పై మీ అభిప్రాయం?

టైం చాలా త్వరగా మారిపోయింది, సో ఇప్పుడు ఓటిటి హవా నడుస్తుంది. ఒకవేళ కరోనా కానీ తగ్గిపోతే మళ్ళీ ఖచ్చితంగా థియేటర్స్ అన్నీ తెరుచుకుని మొదటిలా మారుతుంది.

ఇక ఈ సినిమా చూసాక మీకేం అనిపించింది?

నాకు అయితే చాలా బాగా అనిపించింది. నా కెరీర్ లో ది బెస్ట్ ఈ సినిమాకి ఇచ్చా అనిపించింది. కొన్ని ఎమోషన్స్ అవన్నీ మీరు చూస్తారు. ఒక ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి అలా తీసుకొనే నారప్ప ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాక ఫ్యాన్స్ నుంచి ఫ్రెండ్స్ నుంచి అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే సినిమా కూడా ప్రతీ ఒక్కరికీ నచ్చుతుంది.

సంబంధిత సమాచారం :