‘అసురన్’గా మారనున్న వెంకటేష్ !

‘అసురన్’గా మారనున్న వెంకటేష్ !

Published on Oct 24, 2019 9:28 PM IST

Venkatesh2

ధనుష్, మంజు వారియర్ జంటగా తెరకెక్కిన అసురన్ సినిమా తెలుగులో రీమేక్ కానుంది. ఈ యాక్షన్ డ్రామాను వెట్రిమారన్ తెరకెక్కించారు. దసరా సెలవుల్లో తమిళనాట విడుదలై సంచలన విజయం సాధించింది అసురన్ చిత్రం. ఈ మధ్య కాలంలో కేవలం కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలను మాత్రమే చేస్తున్న హీరో వెంకటేష్.. అసురన్ తెలుగు రీమేక్‌లో నటించబోతున్నారు.

కాగా అసురన్ తెలుగు వర్షన్‌ ను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. అతి త్వరలో చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నారు.

ఇక వెంకటేష్ ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీ మామ’. కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు