నారప్ప ట్రైలర్ రెస్పాన్స్ పై వెంకిమామ రియాక్షన్!

Published on Jul 15, 2021 7:38 pm IST

విక్టరీ వెంకటేష్ హీరో గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం నారప్ప. ఈ చిత్రం తమిళం లో సూపర్ హిట్ సాధించిన అసురన్ చిత్రానికి రీమేక్. అయితే ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదల అయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం లో వెంకటేష్ నటన కి గానూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ గా ఉండటం, వెంకటేష్ మాస్ పెర్ఫార్మెన్స్ హైలెట్ గా ఉండటం తో ఈ చిత్రం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ సాధించడం తో వెంకటేష్ సంతోషం వ్యక్తం చేశారు.

నారప్ప చిత్రం ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సంతోషంగా ఉందని గ్రేట్ ఫుల్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ చిత్రం జూలై 20 వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ కానున్న సంగతి తెలిసిందే. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :