మన టాలీవుడ్ లో ఎన్నో మరపురాని ఘన విజయాలను సాధించి ‘విక్టరీ’ నే తన ఇంటి పేరుగా చేసుకున్న వెంకటేష్ దగ్గుబాటి జన్మదినం డిసెంబర్ 13. ప్రస్తుతం ‘నారప్ప’ గా పవర్ ఫుల్, ఇంటెన్స్ రోల్ లో కనిపిస్తున్న వెంకీ పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ ఈ రోజు (డిసెంబర్ 12) రాత్రి 8:00 గం లకు విడుదల చేయనున్నారు.
ఈ సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి ‘F3’ చేయనున్న విషయం తెలిసిందే. కాగా ఈ పుట్టినరోజుకు వెంకటేష్ న్యూ ఫోటోషూట్ స్టిల్స్ రిలీజ్ అయ్యాయి. ఈ స్టిల్స్ లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో, గెడ్డంతో స్టైలిష్ గా వెంకీమామ అదరకొడుతున్నారని అంతా అంటున్నారు.
అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకున్న ఈ స్టిల్స్ నార్మల్ గా తీసినవే అని చెప్తున్నప్పటికీ, ఫ్యూచర్ లో రాబోయే ఫిల్మ్ లో ఖచ్చితంగా ఈ స్టైలిష్ లుక్ తో విక్టరీ వెంకటేష్ ప్రేక్షకులను అభిమానులను అలరించనున్నారని తెలుస్తోంది. మరి వెంకీ మామ ఏ సినిమాలో ఇలాంటి లుక్ లో కనిపిస్తారో అన్నది చూడాలి.


