వైరల్ పిక్: వెంకీ మామ తో హిట్ మ్యాన్!

Published on Sep 17, 2023 10:12 pm IST


టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ముఖ్యమైన మ్యాచ్ లకి వెంకీ మామ అటెండ్ అవుతూనే ఉంటారు. తాజాగా ఒక ఫోటోను సోషల్ మీడియా లో షేర్ చేశారు వెంకటేష్. అది హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తో దిగిన ఫోటో. షేర్ చేసిన కొద్ది సేపటికే సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది.

ఫోటో లో కెప్టెన్ రోహిత్ శర్మ మరియు వెంకీ మామ లు సెల్ఫీ కి ఫోజులు ఇచ్చారు. అంతేకాక ఆసియా కప్ ను ఇంటికి తీసుకు రండి అని అందులో పేర్కొన్నారు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమ్ ఇండియా శ్రీలంక పై 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.

సంబంధిత సమాచారం :