ఓటిటిలో భారీ రెస్పాన్స్ తో “విడుదలై 1”.!

Published on May 4, 2023 2:30 pm IST

రీసెంట్ గా కోలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చి భారీ హిట్ అయ్యిన చిత్రాల్లో సహజ చిత్రాల దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన చిత్రం “విడుదలై” కూడా ఒకటి. ప్రముఖ కమెడియన్ సూరి హీరోగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం తమిళ్ లో హిట్ అయ్యాక తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి వసూళ్లు రాబట్టింది. ఇక ఈ చిత్రం అయితే తమిళ్ వెర్షన్ లో ఈ మధ్యనే స్ట్రీమింగ్ యాప్ జీ5 లో రిలీజ్ అయ్యింది.

దర్శకుడు వెట్రిమారన్ కట్ గా రిలీజ్ చేసిన ఈ సినిమాకి అయితే జీ 5 లో భారీ రెస్పాన్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఇందులో ఈ సినిమా ఫాస్టెస్ట్ 50 మిలియన్ మినిట్స్ ని నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ సినిమాకి థియేటర్స్ తో పాటుగా ఓటిటి లో కూడా అదిరే రెస్పాన్స్ వచ్చింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించగా మేకర్స్ రెండో పార్ట్ ని కూడా త్వరలోనే ఫినిష్ చేసి రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :