ఎన్టీఆర్ బసవతారకం.., శకుంతలా దేవిగా.

Published on Sep 16, 2019 12:05 pm IST

టాలెంటెడ్ హీరోయిన్ విద్యాబాలన్ ఈఏడాది ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను పలకరించారు. మొట్టమొదటి సారి తెలుగు చిత్రంలో నటించిన విద్యాబాలన్ ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. చిత్ర ఫలితం ఎలా ఉన్నా ఆమె నటనకు మాత్రం మంచి ప్రశంసలు అందాయి.

తాజాగా మిషన్ మంగళ్ చిత్రంలో స్పేస్ సైంటిస్ట్ తారా షిండే పాత్రలో కనిపించారు. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఘనవిజయం అందుకుంది. కాగా విద్యాబాలన్ మరో బయోపిక్ కొరకు సిద్ధం అవుతున్నారు. గణిత మేధావి అయిన శకుంతల దేవి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న శకుంతల దేవి అనే చిత్రంలో ఆమె నటిస్తున్నారు. నేటి నుండి చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రానికి దర్శకత్వం అను మీనన్ వహిస్తుండగా, సోనీ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతుంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రం విడుదల కానుందని సమాచారం.

సంబంధిత సమాచారం :

X
More