ఆ క్రేజీ సినిమా ఆగిపోలేదు !

Published on May 17, 2021 10:34 pm IST

విజయ్ సేతుపతి హీరోగా, సమంత నయనతార హీరోయిన్లుగా దర్శకుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమాని ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. పైగా నిర్మాత కూడా నయనతారనే. అయితే ఈ సినిమా ఆగిపోయిందని ఈ సినిమా కథ విషయంలో విగ్నేష్ శివన్ కి కొన్ని అనుమానాలు ఉన్నాయని అందుకే సినిమాని మధ్యలోనే ఆపేశాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా ఆగలేదని తెలుస్తోంది.

నిజానికి ఈ సినిమా అనౌన్స్ చేసిన తరువాత సడెన్ గా కరోనా రావడం, అంతలో లాక్ డౌన్ ను పెట్టడం దాంతో ఈ సినిమా షూట్ మొదలవడం లేట్ అయింది. ఇక జనవరిలో హైదరాబాద్ లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా జరిగింది. దాదాపు నెల రోజులు పాటు షూట్ చేశారు. ఆ తరువాత మళ్ళీ సెకెండ్ వేవ్ వచ్చింది. మరోపక్క విజయ్ సేతుపతి తమిళ్ తెలుగుతో పాటు హిందీ సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు. అలాగే సమంత కూడా ప్రస్తుతం బిజీగా ఉంది. ఒకేసారి విజయ్ సేతుపతి, సమంత, నయనతార డేట్స్ దొరకగానే ఈ సినిమా మళ్ళీ సెట్స్ పైకి వెళ్తుందట.

సంబంధిత సమాచారం :