తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తన 63వ చిత్రం లో నటించనున్నాడని తెలిసిందే. ఈచిత్రం వచ్చే ఏడాది జనవరి 16నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన సెట్స్ పనులు ప్రారంభం అయ్యాయి. ఇక ఈచిత్రం పోలిటికల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని వార్తలు వచ్చినా తాజాగా ఆ వార్తల్లో నిజం లేదని సమాచారం. డిఫ్రెంట్ జోనర్ లో రూపొందనున్న ఈచిత్రంలో విజయ్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయిక గా నటించనుంది. 9సంవత్సరాల తరువాత ఈ చిత్రంకోసం మళ్ళీ వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు.
భారీ బడ్జెట్ తో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్నఈచిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రం వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదలకానుంది.
