రేపటి నుండి సెట్స్ మీదకు విజయ్ 63 !

రేపటి నుండి సెట్స్ మీదకు విజయ్ 63 !

Published on Jan 20, 2019 2:32 PM IST

తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటించనున్న 63వ చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రేపటి నుండి ఈచిత్రం రెగ్యూలర్ షూటింగ్ ను జరుపుకోనుంది. ఇక ఇప్పటికే ఈచిత్రం కోసం ఆర్ట్ డైరెక్టర్ ముత్తురాజ్ భారీ సెట్ ను నిర్మించారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో యువ దర్శకుడు అట్లీ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో విజయ్ కోచ్ పాత్రలో కనిపించనున్నాడు.

భారీ బడ్జెట్ తో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈచిత్రంలో నయనతార కథానాయిక నటించనుంది. ఎఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఇక ‘తెరి ,మెర్సల్’ చిత్రాల తరువాత విజయ్ – అట్లీ కలయికలో రానున్న ఈచిత్రం ఫై కోలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది దీపావళికి ఈచిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు