శంకర్ దర్శకత్వంలో విజయ్ మూవీ…?

శంకర్ దర్శకత్వంలో విజయ్ మూవీ…?

Published on Jun 30, 2019 1:31 PM IST

తలపతి విజయ్ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకతంలో “బిగిల్” అనే చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇటీవలే ఆయన పుట్టిన రోజు సందర్బంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో నాలుగు విభిన్న గెట్ అప్స్ లో కనిపించి సినిమాపై అంచనాలు ఆకాశానికి పెంచేశారు. విజయ్ ఈ చిత్రం తరువాత లోగేష్ భాగ్యరాజ్ దర్శకత్వంలో నటించనున్నారని సమాచారం.

మరో ఆసక్తికర వార్త కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే విజయ్ తన 65వ చిత్రం స్టార్ డైరెక్టర్ శంకర్ తో చేయనున్నారట.ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబందించిన చర్చలు వీరి మధ్య జరుగుతున్నాయట. దీనిపైన ఇంత వరకు ఎటువంటి అధికారక సమాచారం లేనప్పటికీ కొన్ని మాధ్యమాలలో ప్రముఖంగా వినిపిస్తున్నది. శంకర్ కొన్ని రోజుల క్రితం కమల్ హాసన్ తో మొదలుపెట్టిన భారీ చిత్రం “భారతీయుడు” వివాదాల వలన ఆగిపోయిన నేపథ్యంలో ఈ వార్తలకు బలం చేకూరుతుంది. విజయ్, శంకర్ కాంబినేషన్ లో గతంలో “స్నేహితుడు” మూవీ వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు