సెప్టెంబర్ 17 కి విడుదల అవుతున్న విజయ్ ఆంటోనీ “విజయ రాఘవన్”

Published on Sep 2, 2021 12:46 am IST


విజయ్ ఆంటోనీ మరియు ఆత్మిక హీరొ హీరోయిన్ లుగా నటిస్తున్న తాజా చిత్రం విజయ రాఘవన్. ఆనంద కృష్ణన్ దర్శకత్వం లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రం కి సంబంధించిన విడుదల తేదీ ను చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించడం జరిగింది. ఈ చిత్రాన్ని ఈ నెల 17 వ తేదీన థియేటర్ల లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది.

విజయ్ ఆంటోనీ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యం లో మరొక చిత్రం విజయ్ రాఘవన్ రిలేజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ పోస్టర్ ను విడుదల చేయడం తో ప్రేక్షకులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి నివాస్ కే ప్రసన్న సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి టి.డి. రాజ మరియు డి. ఆర్. సంజయ్ కుమార్ లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ఉతయ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :