రొమాంటిక్ కంట్రీలో రౌడీ హీరో షూటింగ్ వివరాలు.

Published on Jun 3, 2019 10:54 am IST

విజయ దేవరకొండ డైరెక్టర్ క్రాంతి మాధవ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ ఫ్రాన్స్ లో శరవేగంగా సాగుతుంది.మొన్నటివరకు హైదరాబాద్ పరిసరప్రాంతాలలో చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ షెడ్యూలు ని ఫ్రాన్స్ కి షిఫ్ట్ చేశారంట. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం సుదీర్ఘమైన షెడ్యూల్ ని ప్లాన్ చేశారంట చిత్ర యూనిట్.

రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇజబెల్లా డి హీరోయిన్స్ గా విజయ్ దేవరకొండ తో రొమాన్స్ చేయనున్నారు. రొమాంటిక్ కామెడీ జోనర్లో ఈ మూవీని దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీని క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కె ఏ వల్లభ నిర్మిస్తుండగా, సీనియర్ నిర్మాత కె ఎస్ రామా రావు సమర్పిస్తున్నారు. ఈ మూవీ కి టైటిల్ ఇంకా నిర్ణయించాల్సివుంది.

సంబంధిత సమాచారం :

More