కబీర్ సింగ్” కి “అర్జున్ రెడ్డి” బెస్ట్ విషెస్

Published on Jun 16, 2019 2:02 am IST

ఒక్క సినిమా “అర్జున్ రెడ్డి” విజయ్ దేవరకొండ జీవితాన్నే మార్చేసింది. అప్పటివరకు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ గుర్తింపుకు నోచుకోని విజయ్ ఒక్కసారిగా స్టార్ ఐపోయాడు. సందీప్ రెడ్డి వంగ స్టార్ డైరెక్టర్ ఐపోయారు. ఈ మూవీ తమిళ,హిందీ భాషల్లో అనువాదం అవుతున్న సంగతి తెలిసిందే.

హీరో షాహిద్‌ కపూర్‌, కైరా అద్వాని జంటగా సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘అర్జున్ రెడ్డి’ హిందీ అనువాదం ‘కబీర్‌సింగ్‌’ జూన్‌ 21న విడుదల కు సిద్ధమైంది.ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. నటుడు విజయ్ దేవరకొండను తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘కబీర్‌ సింగ్‌’ గురించి మీడియా ప్రశ్నించగా ఆయన ఆసక్తికర స్పందించారు. ‘హిందీ రీమేక్‌ను కూడా నా స్నేహితుడు సందీప్‌ తీయడంతో సినిమా ఎలా ఉంటుందో చూడాలని ఎక్సయిటింగ్ గాఉంది. ‘ఇష్క్‌ విష్క్‌’ సినిమా నుంచి షాహిద్‌ ఓ మంచి నటుడిగా నాకు తెలుసు. ఇప్పుడు ‘కబీర్‌ సింగ్‌’లోనూ ఆయన అద్భుతంగా నటించి ఉంటారు. ఆ నమ్మకం నాకుంది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ కావాలని కోరుకుంటున్నానని తెలిపారు.

సంబంధిత సమాచారం :

X
More