దర్శకుడి కోసం అతిథి పాత్ర చేసిన విజయ్ దేవరకొండ !

దర్శకుడి కోసం అతిథి పాత్ర చేసిన విజయ్ దేవరకొండ !

Published on Jun 27, 2018 12:36 PM IST

Vijay Devarakonda

చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతూ స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న యువ హీరో విజయ్ దేవరకొండను ప్రేక్షకులకు దగ్గర చేసిన సినిమా ‘పెళ్లి చూపులు’. ఈ సినిమాతో కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ అందుకున్నారు విజయ్. అందుకే ఆ చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం.

ఈ అభిమానంతోనే తరుణ్ భాస్కర్ కోసం ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంలో విజయ్ అతిథి పాత్ర చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఒకేవేళ ఈ వార్త ఖచ్చితమైనదే అయితే సినిమాలో విజయ్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా కనిపిస్తాడో చూడాలి. సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రంలో సుశాంత్ రెడ్డి, విశ్వక్ సేన్ నాయుడు, వెంకటేష్ కాకుమాను, అభినవ్ గోమటంలు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 29న విడుదలకానున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతాన్ని అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు