మహేష్ బాబుతో ఎంజాయ్ చేసే రోజు వచ్చిందట !

మహేష్ బాబుతో ఎంజాయ్ చేసే రోజు వచ్చిందట !

Published on Aug 24, 2018 9:18 PM IST

vijay22

గీత గోవిందం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ ఉన్నట్టు ఉండి సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గరకి వెళ్లారు. ఈ విషయాన్ని స్వయంగా విజయే తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘మహేష్ సర్‌.. వంశీ అన్న.. మహర్షి సెట్‌ కు వెళ్లాను. మహేష్ సర్‌ సినిమా టికెట్ల కోసం తనుకున్నే రోజుల దగ్గరనుంచి ఇప్పుడు ఆయనతో కలిసి సెట్‌ లో ఎంజాయ్‌ చేసే రోజు వచ్చింది. ఫుల్‌ లవ్’ అని విజయ్‌ దేవరకొండ, మహేష్ బాబు మరియు వంశీ పైడిపల్లితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు.

ఇక ప్రస్తుతం మహర్షి చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా అల్లరి నరేష్ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు , అశ్వినీదత్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో విడుదల అవ్వడానికి సన్నాహాలు జరుపుకుంటుంది.

తాజా వార్తలు