ఎందుకు పాడాల్సివచ్చిందో వివరించిన విజయ్ దేవరకొండ !

Published on Jul 25, 2018 8:38 pm IST

విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గీత గోవిందం. ఇటీవల విడుదలైన ‘ఇంకేం ఇంకేం’ అనే సాంగ్ ఇప్పటికే 2 కోట్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రంలోని తరువాతి పాటను రేపు విడుదల చేయనున్నారు. ఈ సాంగ్ ని విజయ్ దేవరకొండ పాడడం విశేషం.

ఈ సాంగ్ ఎందుకు పాడాల్సి వచ్చిందో తాజాగా విడుదల చేసిన మేకింగ్ వీడియోలో విజయ్ చెప్పాడు. ఇప్పుడు పాడినట్టే మళ్లీ ఒకసారి పాడు అని టీం అడిగితే ఆలా రాదని అయినా రెహమాన్ , సోను నిగమ్, అర్జిత్ సింగ్ లాంటి వాళ్లతో పాడించాలనుకొని వాళ్లెవరు దొరక్క నాతో పాడించారు అని ఆయన అన్నాడు.

గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈచిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగష్టు 15న ప్రేక్షకులముందుకు రానుంది.

వీడియో కొరకు క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :