ఇంటర్వ్యూ : విజయ్ దేవరకొండ – ప్రేమ విషయంలో గోవిందం కూడా అర్జున్ రెడ్డి టైపే !

Published on Aug 14, 2018 4:29 pm IST


విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా పరశురాం దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘గీత గోవిందం’. గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. కాగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంధర్బంగా ఈ చిత్ర హీరో విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

బాగా బిజీగా ఉన్నారు అనుకుంటా ?
బిజీగా వర్క్ చేయడం మంచిందే కదా. నేనైతే కమిట్ మెంట్ తో పని చేస్తున్నాను.

ఈ ‘సక్సెస్’ఫుల్ ఫేజ్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ? ఈ ఫాలోయింగ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది ?
నిజం చెప్పాలంటే ఈ సిట్యుయేషన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో కూడా తెలియట్లేదు. అసలు నేను ఇవ్వన్నీ ఆలోచింట్లేదు. యాక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను అంతే. కానీ కొన్ని సార్లు ఈ ఫాలోయింగ్ వల్ల చిన్న కన్ ఫ్యూజన్ కి గురవుతుంటా.

మరి కన్ ఫ్యూజన్ ఎక్కువైతే తప్పులు చేస్తారేమో ?
నా వల్ల నాకు సంబంధించి తప్పులు జరిగితే పర్లేదు. వేరే ఎవరో చేసిన తప్పులకు మనం బాధ్యత వహించాలంటేనే కష్టం. ఇప్పటివరకు నేను మాత్రం నాకు నచ్చింది చేసుకుంటూ పోతున్నాను.

ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి ?
నా పాత్ర గురించి అంటే ఈ సినిమాలో నేను ఓ అసిస్టెంట్ ప్రొఫిసర్ గా నటించాను. నిజానికి నా పాత్ర జూనియర్ సైంటిస్ట్ పోస్ట్ కు అప్లే చేసి ఉంటుంది. ఆ పోస్ట్ వచ్చే గ్యాప్ లో ఓ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫిసర్ గా వర్క్ చేస్తుంటుంది.

సింగింగ్ మీద మీ ఒపీనియన్ ఏమిటి ?
ఐ లవ్ సింగింగ్ అండి. కానీ నా లైఫ్ లో సింగింగ్ మీద చికాకు పడ్డ సందర్భం కూడా ఒకటి ఉంది. నేను ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు ఈవెనింగ్ క్లాస్ లో స.రి.గ.మ అని అవి ఏవో పాండించేవారు. అప్పుడు నేను హాయిగా ఆడుకున్నే టైంలో ఈ స.రి.గ.మల (నవ్వుతూ) గోల ఏందిరా భయ్ అని తిట్టుకుంటుండేవాడ్ని. అలాంటి నేను చివరికి సినిమాలో పాట పాడాను.

మీరు పాట పాడే సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారు లేరట కదా. మరి అంత బాగా ఎలా పాడారు ?
నిజంగానే బాగా పాడానా ? అంటే నేను పాడిన పాటకే ఎక్కువ ట్రోలింగ్ అయింది కదా, అందుకు అడుగుతున్నాను. ఇక పాట విషయానికి వస్తే నేనైతే మాములుగానే పాడేశాను. చివరికి జనానికి నచ్చేలేదు. దాంతో మార్చేద్దాం అనుకోని మార్చేయటం జరిగింది. కొత్త సింగర్ పాడారు. అయితే ఓవర్సీస్ లో మాత్రం నేను పాడిన పాటే ఉంటుంది. ఇండియాలో వేరే సింగర్ పాడింది ఉంటుంది.

గోవిదంలో అర్జున్ రెడ్డి ఛాయలు ఏమైనా ఉంటాయా ?
అలా ఏమి ఉండదండి. కానీ ఒక్క విషయంలో మాత్రం అర్జున్ రెడ్డి, గోవిధం ఒకేలా రియాక్ట్ అవుతారు. అదే, ప్రేంయించిన అమ్మాయి కోసం ఇద్దరు ఎంత దూరం వెళ్తారు. అంటే ఒక్క ప్రేమ విషయంలో మాత్రం గోవిందం కూడా అర్జున్ రెడ్డి టైపే.

గీతగోవిందం గురించి చెప్పమంటే ఏమి చెప్తారు ?
ఈ సినిమాలో నేను బాగా చేసానంటే ఒకే ఒక్క వ్యక్తి కారణం. ఆయనే డైరెక్టర్ పరుశురామ్ గారు. ఇక ఈ సినిమా ఇంత బాగా రావటానికి కారణం మాత్రం బన్నివాసుగారు. వాసుగారు గురించి మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఈ ఫ్యామిలీ సినిమాలు చేయకూడదు అనుకుంటున్న సమయంలో ఆయన నన్ను కూర్చోపెట్టి మరి, నాకు చాలా చెప్పి నాతో ఈ సినిమా చేయించారు.

ఈ సినిమా విడుదలకి ముందే కొన్ని సన్నివేశాలు లీక్ అయ్యాయి. ?
అవును లీక్ అయ్యాయి. చాలా బాధాకరమైన విషయం. అయిపోయినదాని గురించి ఏమి చేస్తాం. అయినా లైఫ్ లో డ్రామా ఉండాలి కదా. ఖచ్చితంగా ప్రొబ్లెమ్స్ వస్తాయి, ఫేస్ చెయ్యాలి తప్పదు.

త్వరలో మీరు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్నారట ?
ఎవరు చెప్పారు ఈ బ్రేకింగ్ న్యూస్. ఇది పూర్తిగా అవాస్తవం.

మీకు తెలుగులో బాగా నచ్చిన సినిమా ఏది ?
వెంకటేష్ గారు త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, మల్లీశ్వరి, నాగార్జునగారి సినిమా ‘మన్మధుడు’ ఈ సినిమాలు నాకు చాలా బాగా ఇష్టం. అలాగే దిల్ రాజు గారి బొమ్మరిల్లు చిత్రం కూడా.

మీ తర్వాత చిత్రాలు గురించి చెప్పండి ?
ప్రస్తుతం డియర్ కామ్రేడ్ షూటింగ్ జరుగుతుంది. సెప్టెంబర్ నుంచి క్రాంతి మాధవ్ గారి దర్శకత్వంలో కెయస్ రామారావుగారి బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నాను.

సంబంధిత సమాచారం :

X
More