ఆల్-టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన లిస్ట్ లో ‘గీతగోవిందం’ !

Published on Aug 26, 2018 10:00 am IST

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయి కలెక్షన్స్ ను రాబడుతూ భారీ బ్లాక్ బ్లాస్టర్ దిశగా దూసుకువెళ్తుంది.
తాజాగా యుఎస్ లోనూ ఈ చిత్రం $ 2 మిలియన్ క్లబ్లో ప్రవేశించి అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది. యుఎస్ లో విజయ్ దేవరకొండ మొదటి $ 2 మిలియన్ల చిత్రం ఇదే కావడం విశేషం. .

ఈ చిత్రం అమెరికాలో 125 లొకేషన్స్ లో 139 కోట్ల డాలర్లను వసూలు చేసింది, కాగా తాజాగా మొత్తం $ 2 మిలియన్లకు పైగా వసూలు చేసింది. టాలీవుడ్ లో ఆల్-టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో గీతగోవిందం ప్రస్తుతం 6వ చిత్రంగా ఉంది

సంబంధిత సమాచారం :

X
More