ఈసారి కూడా టాప్ ప్లేస్ విజయ్ దేవరకొండదే

Published on Mar 18, 2020 7:07 pm IST

హైదరాబాద్ టైమ్స్ ఎప్పటిలాగే 2019కి కూడా మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ జాబితాను తయారుచేసింది. ఈ స్థానంలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. వరుస సినిమాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ, గత యేడాది మొత్తం ట్రెండింగ్లోనే ఉన్నారు. అంతేకాదు స్టైల్ పరంగా తనదైన మార్క్ క్రియేట్ చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. దీంతో ఓటర్లు ఆయన్ను మొదటి స్థానంలో నిలబెట్టారు.

జాబితాలో ఇంకొందరు స్టార్ హీరోలు ఉన్నా కూడా విజయ్ దేవరకొండ మొదటి స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. 2018 జాబితాలో కూడా విజయ్ మొదటి స్థానాన్నే దక్కించుకున్నారు. ఇకపోతే సినిమాల పరంగా వరుస పరజాయల్ని చవిచూస్తున్న విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న చిత్రం. దీని మీదే విజయ్ ఆశలన్నీ ఉన్నాయి.

సంబంధిత సమాచారం :