విద్యార్థులకు విజయ్ దేవరకొండ గిఫ్ట్

Published on Jun 16, 2019 7:17 pm IST

అతి తక్కువ సమయంలో యువతలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో అంటే అది విజయ్ దేవరకొండనే. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో కుర్రాళ్ళకి దగ్గరైన ఈ హీరో ‘గీత గోవిందం’తో అమ్మాయిలకు కూడా హాట్ ఫెవరెట్ అయ్యాడు. విజయ్ అభిమానుల్లో ఎక్కువ శాతం మంది విద్యార్థులే. అందుకే ఆయన వారికి ఒక గిఫ్ట్ రెడీ చేశాడు.

త్వరలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంకానుంది. స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్ అవుతున్నాయి. విద్యార్థులంతా బట్టలు, ఇతరత్రా వస్తువులు, ఫీజులు అంటూ ఎక్కువగానే ఖర్చు చేస్తుంటారు. వారి కోసమే విజయ్ తన బట్టల బ్రాండ్ రౌడీ వేర్ తరపున రౌడీ స్టూడెంట్ మార్కెట్ పేరుతో కొంత డిస్కౌంట్ ప్రకటించాడు. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు కోసమే కావడం విశేషం. ఇంటర్నెట్లో రౌడీ వేర్ కొనుగోలు చేసేప్పుడు రౌడీ స్టూడెంట్ అనే కూపన్ వినియోగిస్తే వంద రూపాయల వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు. ఈ ఆఫర్ 16 నుండి 23వరకు ఉండనుంది. ఇంకెందు ఆలస్యం.. రౌడీ వేర్ పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులంతా అవకాశాన్ని వాడేసుకోండి మరి. ప్రస్తుతం ‘హీరో’ సినిమా షూటింగ్లో ఉన్న విజయ జూలై 26న ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకురానున్నాడు.

సంబంధిత సమాచారం :

More